20 June 2020

సమస్య: తమ్ములఁ జంపుమంచు నొక తండ్రిని పుత్రుఁడు కోరెఁ నమ్రుఁడై

ఉ. .
నమ్మిక మృగ్యమాయెను వినాశము బుట్టెను ధర్మ హానిచే
సొమ్ములు తోడ భూములను సోదరు లెల్లరు పంచి యిమ్మనన్
వమ్మయి యాశ లో దగిలి పాపపు చింతన, వశ్యుడవ్వగా
తమ్ములఁ జంపుమంచు నొక తండ్రిని పుత్రుఁడు కోరెఁ నమ్రుఁడై

పురణ: బిట్రా వెంకట నాగమల్లేశ్వర రావు, చీరాల.