అంటే నా గురించి నేను చెప్పుకునే నాలుగు ముక్కలు
పుట్టింది చీరాల, చదివిందీ చీరాలే, ప్రపంచాన్ని చూసిందీ చీరాల నుంచే.
కానీ కూపస్త మండుకాన్నిమాత్రం కాలేదు.
సాహిత్యమంటే వల్లమాలిన ఇష్టం - చిన్నప్పటి నుంచీ!
వృతి రీత్యా నేత చీరల కొంగులకు బొమ్మలు వేసి నేత పనివాలకు అందివ్వడం.
వ్యావృతి సాహిత్య చర్చలకు చెవినొగ్గటం. వినీ వినీ ఉండలేక ఏదో ఒకటి రాస్తే అది
కవిత్వంలాగా ఉందట. మిత్రులు చెబితే నమ్మబుద్ధి కావడం లేదు,
రాయడం కన్నా వినడం ఎంతో తేలిక కదా! అందుకే మీరు వ్రాయండి నేను చదువుతా .
బాగున్నదానిని నలుగురికీ చూపిస్తా...
బాగా రాయాలంటే బాగా చదవాలి కదా!
మీరు చదివిన మీకు బాగా నచ్చిన నాటి, నేటి కథలు, కవిత్వం ,వ్యాసం ఏవైనా మాకు చెప్పండి.
మీకు తెలిసిందీ మాకు తెలిసిందీ నలుగురికి చెప్పుకుందాం ...
- మీ సాహిత్య మిత్రుడు
బిట్రా వెంకట నాగ మల్లేశ్వరరావు

నచ్చితే చెప్పండి ముందుకు సాగుదాం
- మీ సాహిత్య మిత్రుడు
బిట్రా వెంకట నాగ మల్లేశ్వరరావు