గజల్ గులాబీలు


పూల రెక్కున వాలి తుమ్మెద రెక్క పాడిన తారంగం
ఆకు ముడతను చేరి గొల్లెత (గొల్లభామ ) ఆట లాడిన తారంగం

పవన వీచిక మోసుకొచ్చిన సన్నజాజుల పరిమళాలు
పరవశించిన కొంటె తూనిగ తారకాడిన తారంగం

గాలి కెగిరిన పైట కొంగును ఒడిసి పట్టిన కొమ్మ రెమ్మలు 
మేను సోకిన పిల్లగాలికి తెలియాడిన తారంగం

వయసు పొదలో రగులు కోరిక గుబులు తుట్టెను కదుపుతోంది
కలల నదిలో  ఊహ పడవై ఉగులాడిన తారంగం

కన్నె వయసుకు వలపు జెలుగును సంతరించిన వన్నెకాడు
గగన వీధిని దూది పింజై తూగులాడిన తారంగం

కన్నె సొగసుల వలపు పంటకు కాపు ఎవడో కన్ను ఎరుగదు
ఏటి వాలున సాగు తెప్పై కుంకులాడిన తారంగం

నాగమల్లికి నిదుర చెదరిన మధుర రాత్రికి రాణి ఎవరో
తీయ తేనియ చిలికి అలరిన పెదవి పాడిన తారంగం








No comments: