25 December 2016
24 December 2016
21 October 2016
30 September 2016
26 September 2016
25 September 2016
వంశపారంపర్య వ్యాధులు మేనరికాలతో బలపడి సంతుకు కోప్ప కీడు చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి తరతరానికి తగ్గిపోయి, ఎక్కువగా అతి తేలికగా అంటు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
గర్భ స్రావాలు, మానసిక బలహీనులు పుట్టే అవకాసం ఎక్కువ. అవయలోపం గలిగిన పిల్లలు కుడా కలగవచ్చు. కనుక సాధ్యమయినంత వరకు మేనరికాలకు స్వస్తి పలకండి. ఆరోగ్యకరమైన బలమైన, వివేకులయిన సంతానాన్ని జాతికి అందించండి.
9 September 2016
హోదా గోదాలో గెలుపెవరిది.
ఇవాళా రేపు ఆంధ్రాలో ప్రత్యెక హోదా ఫ్ల-కార్డులతో అట్టుడుకుతున్న ప్రతిపక్షం ఆశించిన మేరకు ప్రజల్లో సెంటిమెంటును కావలసినంతగా రేచ్చాగోట్టిందనే చెప్పాలి.
ఆంధ్రా ప్రతిపక్షాల అల్లరికి ప్రభావితం కాకుండా, మోదీగారు సహజసిద్ధమైన తన ధృడనిశ్చయాన్ని అమలు పరిచే తీరుగా ప్రత్యెక హోదాను ప్రక్కకు నెట్టి, ప్రత్యెక ప్యాకేజీనే ప్రకటించారు.
అనేక పర్యాయాల కేంధ్రంతో సంప్రదింపుల నేపద్యంగా, రాష్ట్ర ప్రభుత్వం తర్జన బర్జనల అనంతరం, ప్రత్యెక ప్యాకేజీని అంగీకరించక తప్పలేదు.
వినవస్తున్న సమాచారం ప్రకారం ప్రత్యేకహోదావల్లరాష్ట్రానికివనగూడ బోయేది, ప్రధానంగా పారిశ్రామిక రాయతీలు. రాయితీ లభిస్తే, పారిశ్రామిక వేత్తలు ఆకర్షింపబడి, నవ్యాంధ్రలో ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు స్తాపింపబడి, తద్వారా ఉద్యోగాలు వెల్లువెత్తుతాయి అని ప్రతి పక్షాల వాదన.
రాజకీయాలకు అతీతంగా, ఈ అంశాలను కొంచం లోతుగా అధ్యయనం చేస్తే, రాజకీయ పార్టీలు బైట పెట్టడానికి సాహసించని కొన్ని చీకటి కోణాలున్నాయి.
1. ఏ పారిశ్రామిక వేత్త అయినా, పరిశ్రమలు స్థాపించే ప్రాంతంలో ఏమి కోరుకుంటాడు.
అనువైన స్థలం
మౌలిక వసతులు
రవాణా సౌకర్యం
ముడి సరకు లభ్యత
మానవ వనరులు
అనుమతుల శీఘ్రత
అవసరం మేరకు రాయితీలు
కేవలం రాయితీలు కల్పించినంత మాత్రాన పరిశ్రమలు స్థాపింపబడతాయనుకోవడం అపోహ మాత్రమే .
2. విభజన చట్టం ప్రకారం, నవ్యాంధ్రకు ఏవైతే పారిశ్రామిక రాయతీలు యివ్వబడతాయో, అవే రాయితీలు తెలంగాణాకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే, ఆంధ్రాతో పోల్చుకుంటే , పారిశ్రామికులు కోరుకునే వనరులు, ఉమ్మడి రాష్త్రంగా వున్నప్పుడు తెలంగాణలో ఏర్పడి వున్నాయిగనుక, పరిశ్రమలు ఎక్కువ శాతం ఆటే తరలి వెళ్ళే అవకాశం వుంది. అందువలన ఆశిస్తున్నట్లుగా రాయితీల వల్ల వనగూరబోయే లబ్ధి పూర్తి స్థాయిలో లభించదు గాక లభించదు.
దీనిని బట్టి ప్రత్యేక హోదాను కోరుకోవడానికి ప్రధాన కారణం పారిశ్రామిక రాయితీని సాధించడమే ఐతే, ఈనగాచి నక్కల పాలు చేసినట్లే అవుతుంది అనేది నా అభిప్రాయం. ఏకీభవించేవారు, వ్యతిరేకించేవారు నిర్మొహమాటంగా కామెంట్ చేయండి.

7 September 2016
4 September 2016
3 September 2016
Subscribe to:
Posts (Atom)