9 September 2016

హోదా గోదాలో గెలుపెవరిది.

ఇవాళా రేపు ఆంధ్రాలో ప్రత్యెక హోదా ఫ్ల-కార్డులతో అట్టుడుకుతున్న ప్రతిపక్షం ఆశించిన మేరకు ప్రజల్లో సెంటిమెంటును కావలసినంతగా రేచ్చాగోట్టిందనే చెప్పాలి.

ఆంధ్రా ప్రతిపక్షాల అల్లరికి ప్రభావితం కాకుండా, మోదీగారు సహజసిద్ధమైన తన ధృడనిశ్చయాన్ని అమలు పరిచే తీరుగా ప్రత్యెక హోదాను ప్రక్కకు నెట్టి, ప్రత్యెక ప్యాకేజీనే ప్రకటించారు.

అనేక పర్యాయాల కేంధ్రంతో సంప్రదింపుల నేపద్యంగా, రాష్ట్ర ప్రభుత్వం తర్జన బర్జనల అనంతరం, ప్రత్యెక ప్యాకేజీని అంగీకరించక తప్పలేదు.

వినవస్తున్న సమాచారం ప్రకారం ప్రత్యేకహోదావల్లరాష్ట్రానికివనగూడ బోయేది, ప్రధానంగా పారిశ్రామిక రాయతీలు. రాయితీ లభిస్తే, పారిశ్రామిక వేత్తలు ఆకర్షింపబడి, నవ్యాంధ్రలో ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు స్తాపింపబడి, తద్వారా ఉద్యోగాలు వెల్లువెత్తుతాయి అని ప్రతి పక్షాల వాదన.

రాజకీయాలకు అతీతంగా, ఈ అంశాలను కొంచం లోతుగా అధ్యయనం చేస్తే, రాజకీయ పార్టీలు బైట పెట్టడానికి సాహసించని కొన్ని చీకటి కోణాలున్నాయి.

1. ఏ పారిశ్రామిక వేత్త అయినా, పరిశ్రమలు స్థాపించే  ప్రాంతంలో ఏమి కోరుకుంటాడు.
    అనువైన స్థలం
    మౌలిక వసతులు
    రవాణా సౌకర్యం
    ముడి సరకు లభ్యత
    మానవ వనరులు
    అనుమతుల శీఘ్రత
    అవసరం మేరకు రాయితీలు
కేవలం రాయితీలు కల్పించినంత మాత్రాన పరిశ్రమలు స్థాపింపబడతాయనుకోవడం అపోహ మాత్రమే .

2. విభజన చట్టం ప్రకారం, నవ్యాంధ్రకు ఏవైతే పారిశ్రామిక రాయతీలు యివ్వబడతాయో, అవే రాయితీలు తెలంగాణాకు కూడా  ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే, ఆంధ్రాతో పోల్చుకుంటే ,  పారిశ్రామికులు కోరుకునే వనరులు, ఉమ్మడి రాష్త్రంగా వున్నప్పుడు తెలంగాణలో ఏర్పడి వున్నాయిగనుక, పరిశ్రమలు ఎక్కువ శాతం ఆటే తరలి వెళ్ళే అవకాశం వుంది. అందువలన ఆశిస్తున్నట్లుగా రాయితీల వల్ల వనగూరబోయే లబ్ధి పూర్తి స్థాయిలో లభించదు గాక లభించదు.

దీనిని బట్టి ప్రత్యేక హోదాను కోరుకోవడానికి ప్రధాన కారణం పారిశ్రామిక రాయితీని సాధించడమే ఐతే, ఈనగాచి నక్కల పాలు చేసినట్లే అవుతుంది అనేది నా అభిప్రాయం.  ఏకీభవించేవారు, వ్యతిరేకించేవారు నిర్మొహమాటంగా  కామెంట్ చేయండి.



2 comments:

ayapilla@gmail.com said...

Nijame na die meer annadi.aalochinchalsina vishayame.avagaahanaa..sahityam to pravarthana..nasta poratam..manchi write up .thank you sir

Unknown said...

మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. రాజకీయ నాయకులు ఎపుడు ఉన్నది ఉన్నట్లు చెప్పారుకనుక. కాంగ్రెసు నాయకులు వారు అధికారంలో ఉండగా చేసినది ఏమీలేదు గాని ఇపుడు మీది ప్రభుత్వము మీద బురద చల్లే ప్రయత్నమే ఇది.